21.5 C
Hyderabad
Wednesday, January 20, 2021

బడ్జెట్ విషయంలో కేంద్రం అనూహ్య నిర్ణయం

ఈసారి బ‌డ్జెట్ విష‌యంలో కేంద్ర ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఈసారి బ‌డ్జెట్ ప్రతుల‌ను ముద్రించ‌కూడ‌ద‌ని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే పార్లమెంట్‌ ఉభ‌య స‌భ‌ల నుంచి ఆమోదం ల‌భించింది. క‌రోనా నేప‌థ్యంలో బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ కోసం 15 రోజుల పాటు 100 మందిని ఒకేచోట ఉంచలేమని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థిక శాఖ తెలిపింది.

ఈసారి బడ్జెట్ సాఫ్ట్ కాపీలను సభ్యులకు పంచనున్నారు. బ‌డ్జెట్ సాఫ్ట్ కాపీల‌ను స‌భ్యులంద‌రికీ అందుబాటులో ఉంచుతామ‌ని ప్రభుత్వం వెల్లడించింది. ఫిబ్రవ‌రి 1న కేంద్ర బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ లోక్‌స‌భ‌లో ప్రవేశ‌పెట్టనున్నారు. జ‌న‌వ‌రి 29 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు రెండు విడ‌త‌లుగా పార్లమెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. తొలి విడ‌త‌లో జ‌న‌వ‌రి 29 నుంచి ఫిబ్ర‌వరి 15 వ‌ర‌కు.. రెండో విడ‌త మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు బడ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతాయి.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...