ఎప్పటినుంచో ఊరిస్తున్న 5జీ నెట్వర్క్ రానే వచ్చింది. 5జీ సేవలకు మేము రెడీ అని ఎయిర్టెల్ తెలిపింది. హైదరాబాద్‌లో లైవ్‌గా 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షించి సక్సెస్ అయింది.
చూస్తుండగానే 2జీ నుంచి 3జీ, 3జీ నుంచి 4జీ వచ్చాయి. ఇప్పుడు ఐదవ జనరేషన్ 5జీ కూడా వచ్చేసింది. ఎప్పటినుంచో 5జీ పై వర్క్ చేస్తున్న ఎయిర్టెల్ ఎట్టకేలకు 5జీ సేవలను అందిచడానికి రెడీ అవుతోంది. ఈ 5జీ స్పీడ్‌తో.. కేవలం సెకన్ల సమయంలోనే పూర్తి సినిమాను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎయిర్టెల్ చెప్తోంది. తగినంత స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చాక, ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా లభించిన తర్వాత పూర్తి స్థాయి సేవలను అందిస్తామని ఎయిర్టెల్ సంస్థ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. ప్రస్తుత టెక్నాలజీతో పోలిస్తే ఎయిర్టెల్ 5జీ పది రెట్లు స్పీడ్‌గా ఉంటుందని, వేగవంతమైన సేవలు అందించగలదని ఆయన అన్నారు.
