వాట్సప్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ రూల్స్ దుమారానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది తమ వాట్సప్ ఖాతాను క్లోజ్ చేసి వేరే చాటింగ్ యాప్స్ కోసం వెతుకుతున్నారు. అయితే వాట్సప్ కాకుండా చాటింగ్ కోసం యాప్స్ వెతుకుతున్నారా..? అయితే ఈ స్టోరీ మీకోమే.
టెలిగ్రామ్ : వాట్సప్ బదులు చాలామంది ఇప్పటికే టెలిగ్రామ్ వాడుతున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంది. ఎంటీ ప్రోటోకాల్ వాడుతున్నందున తమ యాప్ వాట్సప్ కంటే సురక్షితం అని టెలిగ్రామ్ చెప్తోంది.
సిగ్నల్ : వాట్సప్ ప్రైవసీ అంశం తెర మీదకు వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడుకుంటున్న యాప్ సిగ్నల్. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ లలో అందుబాటులో ఉన్న ఈ యాప్ టెస్లా కంపెనీది. వాట్సప్ లో ప్రైవసీకి భంగం కలుగుతుందన్న వాదనలు రాగానే.. చాలామంది సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.
త్రీమా పోయిడ్ : ఈ యాప్ లో మనం పంపిన మెసేజ్ లు కొంతకాలం తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతాయి. గ్రూప్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ లిస్ట్ క్లౌడ్‌లో కాకుండా మీ ఫోన్లోనే స్టోర్ అవుతుంది. 8 అంకెల త్రీమా ఐడీతో ఈ యాప్ లో కమ్యూనికేట్ కావచ్చు. ఇందులో కూడా ఎండ్ టు ఎండ్ ఇన్‌క్రిప్షన్, వాయిస్ కాల్స్, ఫైల్ షేరింగ్, గ్రూప్ ఛాట్స్ వంటి ఫీచర్లున్నాయి.
ఎలిమెంట్ : ఇది కూడా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న మెసేజింగ్ యాప్. మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియోలకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. మెసేజెస్‌ని సేవ్ చేసుకోవచ్చు. ఫ్రీ వర్షన్‌తో పాటు పెయిడ్ వర్షన్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, లైనక్స్తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఉపయోగించొచ్చు.
వైబర్ : కాలింగ్, మెసేజింగ్ యాప్. ఆడియో, వీడియో కాలింగ్, గ్రూప్ ఛాట్స్ ఆప్షన్లు ఉన్నాయి. సెల్ఫ్ డిస్ట్రక్ట్ ఫీచర్ ఉంది. మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. అన్ని కాల్స్, ఛాట్స్‌కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది.