29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ సీరియస్

ఏపీలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైసీపీ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ వరుస షాక్ లు ఇస్తున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవాలపై ఫోకస్ పెట్టారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను ప్రకటించకూడదని గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఏకగ్రీవమైన పంచాయతీలపై పూర్తి నివేదికను ఎన్నికల కమిషన్ కు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఇప్పటివరకు చిత్తూరులో 110, గుంటూరులో 67 పంచాయతీలు ఏకగ్రీవమైననట్లు సమాచారం. ఇటీవలే దీనిపై సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ఏకగ్రీవమైన మండలాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేయాలని లేఖలో సీఎస్ ని ఆదేశించారు.

- Advertisement -

Latest news

Related news