28.2 C
Hyderabad
Sunday, January 17, 2021

తలైవాను దింపేసిన అరవింద్ స్వామి.. చూస్తే మతి పోవాల్సిందే

తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనారనౌత్‌ ‘జయలలిత’ పాత్ర పోషిస్తోంది. ఏఎల్ విజ‌య్ దర్శకుడు. ఈ సినిమా రీసెంట్ గా హైద‌రాబాద్‌లో ముఖ్యమైన షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 

అయితే.. జ‌య‌ల‌లిత జీవితంలో కీల‌క వ్యక్తి అయిన ఎంజీఆర్ పాత్రని అర‌వింద్ స్వామి పోషిస్తున్నాడు. ఇయ్యాల ఎంజీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా జయలలిత సినిమాలో ఎంజీఆర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఎంజీఆర్ పాత్రలో నటిస్తున్న అరవింద్ స్వామి లుక్ ఆయన అభిమానులను, రాజకీయ అనుచరుల మనసు కొల్లగొట్టేసింది. అచ్చు గుద్దినట్టు ఎంజీఆర్ ను దింపేశారు అని ప్రేక్షకులు దర్శకుడిని ఆకాశానికెత్తేస్తున్నారు. వ‌చ్చే సంవత్సరం ఈ సినిమా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తమిళ రాజకీయాలను ఊపేసిన ఎంజీఆర్ చరిత్రలో తన కథను సువర్ణాక్షరాలతో రాసుకున్నారు. ఈ సినిమా అటు ఎంజీఆర్, ఇటు జయలలిత అభిమానులకు మంచి బహుమతి అవుతుంది.

- Advertisement -

Latest news

Related news

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రెండేళ్ల క్రితం...

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ...

తాళిబొట్టు తీసుకొచ్చిన డ్రోన్.. వీడియో వైరల్..

మామూలుగా పెళ్లిళ్లలో గాలిలో డ్రోన్ తిరుగుతూ వేడుకలన్నీ పై నుంచి షూట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అదే డ్రోన్ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి వరుడి చేతికందిస్తే.. ఆ విజ్యువల్...