21.2 C
Hyderabad
Monday, January 18, 2021

ఇకపై ఆన్‌లైన్‌లోనూ ఆర్మీ క్యాంటీన్ వస్తువులు

క్యాంటీన్‌ స్టోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఎస్‌డీ) లభించే ఏఎఫ్‌డీ-1 కేటగిరీ వస్తువులను ఇకపై ఆర్మీ జవాన్లు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. దీనికి సంబంధించిన పోర్టల్‌ను (https://afd.csdindia.gov.in) రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం ప్రారంభించారు. వాషింగ్‌ మెషీన్లు, మైక్రో ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఎయిర్‌ప్యూరిఫైయర్లు, హోం థియేటర్లు, మొబైల్‌ ఫోన్స్‌ వంటి ఖరీదైన వస్తువులు ఏఎఫ్‌డీ-1 కేటగిరీ కిందకు వస్తాయి. సైన్యంలో పనిచేస్తున్న వారితో పాటు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. జవాన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఈ పోర్టల్‌ను తీసుకొచ్చామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్వీటర్లో పేర్కొన్నారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...