ఇటీవల కేరళలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం తరపున పోటీ చేసి విజయం సాధించిన ఆర్యా రాజేంద్రన్ దేశం దృష్టని తనవైపు తిప్పుకొంది. తిరువనంతపురం మేయర్ పీఠాన్ని అధిరోహించి దేశ రాజకీయాల్లోనే చిన్న వయసులోనే మేయర్ పీఠం అధిష్టించిన యువతిగా రికార్డుకెక్కింది.

తిరువనంతపురం ఆల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్యా రాజేంద్రన్ ఇటీవల జరిగిన తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో కార్పోరేటర్ గా పోటీ చేసి గెలిచింది. చిన్న వయసులోనే ఎన్నికల్లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరచగా.. మరోవైపు పార్టీ ఆమెను తిరువనంతపురం మేయర్ గా ఎంపిక చేస్తూ ప్రకటన చేసింది. దీంతో దేశంలోనే యంగెస్ట్ మేయర్ గా ఆర్యా రాజేంద్రన్ రికార్డు సృష్టించింది. చదువును కొనసాగిస్తూనే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆర్యా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.