29.3 C
Hyderabad
Monday, March 1, 2021

రోజుకి ఎన్ని బాదం పప్పులు తినాలి?

ఈ మధ్య చాలామంది రోజూ డ్రైఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకున్నారు. అందులో అందరి ఫేవరెట్ బాదం. రోజుకు గుప్పెడు బాదం పప్పులు తినడం చాలామందికి అలవాటు. అయితే బాదం ఎంతవరకూ మంచిది? రోజుకు ఎన్ని తీసుకోవాలి? ఎక్కువగా తింటే ఏమైనా నష్టం ఉందా?


బాదంలో ఎన్నో పోషకాలుంటాయి. గుప్పెడు బాదం పప్పుల్లో161 క్యాలరీల శక్తి అందుతుంది. ఇందులో 3.5 గ్రాముల ఫైబర్, 14 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల ప్రోటీన్, 2.5 గ్రాముల పిండి పదార్థం, 37 శాతం విటమిన్-E, 32 శాతం మెగ్నీషియం ఉంటాయి.
లాభాలివి
ఇకపోతే బాదంలో మేలైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో కొత్త కణాల పెరుగుదలకు తోడ్పడతాయి. దానివల్ల యవ్వనంగా కనిపిస్తారు.

బాదంలో నాలుగో వంతు కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

బాదం పప్పులు రక్తంలో కొవ్వును తగ్గిస్తాయి. ఇవి హై బీపీతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే బాదం శరీరంలోని చెడు కొవ్వును తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్-E, మెగ్నీషియం, పోటాషియంలు రక్త ప్రవాహం సక్రమంగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బాదంలో పిండిపదార్థం తక్కువ, ఫైబర్ ఎక్కువ. కాబట్టి.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ లోఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లకు కూడా ఇది మంచి ఆప్షన్.

బాదంలో రిచ్ ఫైబర్స్ ఉండడం వల్ల ఇది ఆకలిని అదుపులో ఉంచుతుంది. దానివల్ల ఎక్కువ క్యాలరీలు తీసుకొనే అవకాశం ఉండదు. అలా బరువు కూడా తగ్గొచ్చు.

ఎక్కువ తింటే ఏమవుతుంది?
బాదం పప్పులు బాగుంటాయి కదా అని ఎక్కువ తింటే ప్రమాదమే. రోజుకు ఆరు నుంచి ఎనిమిది బాదం పప్పులు తింటే చాలు. బరువు తగ్గాలన్నా, కండలు పెంచాలన్నా ఇలా ఎలాంటి వారికైనా ఆరు నుంచి ఎనిమిది పప్పులు సరిపోతాయి. మరీ ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు బాదం అతిగా తింటే శ్వాస తీసుకోవడం కష్టం కావచ్చు. ఒక్కోసారి శరీరంలో విషతుల్యాలు పెరగవచ్చు. జీర్ణక్రియ సమస్యలు కూడా రావొచ్చు. అందుకే బాదంపప్పులు తగినంత తినడం మంచిది.

- Advertisement -

Latest news

Related news