29.3 C
Hyderabad
Monday, March 1, 2021

స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌కు సుప్రీం బెయిల్

హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాండప్‌ కమెడియన్ మునావర్‌ ఫారూకీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోలీసులు ఫారూకీపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ స్పష్టంగా లేదని సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
జనవరి 1న న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇండోర్‌లోని ఒక కేఫ్‌లో జరిగిన కామెడీ షోలో హిందూ దేవతలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని బిజేపి ఎమ్మెల్యే కుమారుడు చేసిన ఫిర్యాదు మేరకు మునావర్ ఫారుకి, మరో నలుగురిని జనవరి 2 న అరెస్టు చేశారు.
మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో నమోదైన కేసులో హాస్యనటుడు మునవర్ ఫారుకిపై జారీ చేసిన ప్రొడక్షన్ వారెంట్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. గురువారం కేసు విచారించిన సుప్రీంకోర్టు మునావర్ పై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ “అస్పష్టంగా” ఉందని, అరెస్టుకు ముందు నోటీసు ప్రోసీజర్‌ను ఫాలో అవ్వలేదని పేర్కొంది.

- Advertisement -

Latest news

Related news