మామూలుగా అయితే.. ఛాయ్ తాగంగనే ఏం చేస్తరు? కప్పు తీసి పక్కన పెడతరు. కానీ.. అక్కడ అట్ల కాదు. ఛాయ్ తాగంగనే.. టీ కప్పు కూడా నమిలి మింగేస్తరు. అవును.. మీరు చదివింది నిజమే.. ఛాయ్ తాగంగనే కప్పు నమిలి మింగేస్తరు. అరే.. అట్లెట్ల అయితది అని పరేషాన్ అయితున్నరా? అయితే.. ఈ వార్త మొత్తం సదువుర్రి.
కేరళ రాష్ట్రంల త్రిస్సూర్ అనే సిటీల ఒక బేకరీ ఉంది. ఆ బేకరీల ఛాయ్.. గాజు కప్పులు, ప్లాస్టిక్ కప్పులల్ల పొయ్యరు. బిస్కెట్లతోటి తయారు చేశిన కప్పులల్ల పోస్తరు. ఛాయ్ ఉడుకు ఉడుకు ఉన్నప్పుడే దబ్బ దబ్బ తాగి.. లటుక్కున బిస్కెట్ కప్పు కూడా నోట్ల ఏస్కోవాలన్నట్టు.
మరి.. ఉడ్కు ఉడ్కు ఛాయ్ పోస్తే.. బిస్కెట్ కప్పు ఛాయ్ ల కరిగిపోదా? అని డౌటొచ్చిందా? మీకే కాదు.. వాళ్లకు కూడా వచ్చింది. అందుకే.. స్పెషల్ గ తయారు చేయించిన బిస్కెట్లతోటి గ్లాసులు తయారు చేపిస్తున్నరు. ఛాయ్ పోశిన తర్వాత 20 నిమిషాల దాక గిలాస గట్టిగనే ఉంటదట. ఏడనన్నజెరంత కొత్తగ, వింతగ కనిపిస్తే మనోళ్లు ఊకోరు గదా. అందుకే ఆ బిస్కెట్ కప్పులను ఫొటోలు, వీడియోలు తీశి.. ఫేస్ బుక్కుల, యూట్యూబ్ ల పెడుతున్నరు. ఇంతకీ.. ఆ ఛాయ రేట్ ఎంతనో తెల్సా? జస్ట్ రూ.20 మాత్రమే. మీరు కూడా ఎప్పుడన్న కేరళ రాష్ట్రంల త్రిస్సూర్ దిక్కు పోతే.. ఆ బిస్కెట్ కప్పు ఛాయ్ తాగి రార్రి. మీకు ఇంకో అద్దిరిపోయే విషయం తెలుసా.. ఆ బిస్కెట్ కప్పులు మన హైదరబాద్ లనే తయారైతయ్. త్వరలో.. వెనీలా, చాక్లెట్ రుచులల్ల కూడా బిస్కెట్లు తయారు చేయనున్నరు.