27.9 C
Hyderabad
Friday, January 22, 2021

అప్పుడు నువ్వెక్కడున్నవ్ బండి సంజయ్ : ఎమ్మెల్యే బాల్క సుమన్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీద ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నోరు తెరిస్తే  సీఎం కేసీఆర్ మీద విమర్శలు చేసే బండి సంజయ్ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎక్కడున్నాడని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే.. బీజేపీకి తెలంగాణ శాఖ ఏర్పడిందని.. బండి సంజయ్ కి తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం వచ్చిందని కౌంటర్ వేశారు.

కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ ప్రాంతానికి ఏం చేశారని బాల్క సుమన్ ప్రశ్నించారు. కరీంనగర్ కు జాతీయ రహదారులు ఎందుకు తేలేదని, ఎస్ఈ కార్యాలయాన్ని తరలించింది ఎవరని బండి సంజయ్ ని ఆయన నిలదీశారు. నీకు దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని సవాల్ విసిరారు.

- Advertisement -

Latest news

Related news

వైరల్ అవుతున్న​ ఎలన్‌ మస్క్‌ చాలెంజ్‌

పెరిగిన జనాభా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల లాభమేమోగానీ నష్టమే ఎక్కువ ఉందని అర్థమవుతుంది. పచ్చగా ఉండాల్సిన భూమిపై జీవం ఎండిపోతుంది. వాతావరణంలో ఎన్నెన్నో మార్పులొస్తున్నాయి. ప్రస్తుతం మన ఎన్విరాన్‌మెంట్‌కు ఉన్న...

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...