రైల్వే పట్టాలు దాటే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఓ సంఘటన ఇటీవల చోటు చేసుకుంది. రైల్వే క్రాసింగ్ దగ్గర గేట్లు వేసినా ట్రైన్ రావడం లేదుకదా అని వాహనాలతోపాటు దాటేస్తుంటారు. మన హైదరాబాద్ లో రైల్వే క్రాసింగులు ఎక్కువే కాబట్టి.. ఇలా అజాగ్రత్తగా ఉండే వారిని హెచ్చరించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియోను షేర్ చేసి.. గార్డు లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద జర జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.
ఆ వీడియోలో రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు వేశారు. అయినా మనుషులు, వాహనాలు రైలు పట్టాలను దాటుతున్నారు. ఇంతలో రైలు కన్పించడంతో ఎటోళ్లు అటే ఆగిపోయారు. ఓ యువకుడు మాత్రం బైక్‌పై స్పీడ్‌గా వచ్చి.. రైతు రావడాన్ని చూశాడు. సడన్ బ్రేక్ వేసినా.. న్యూట్రల్ చేయకుండానే క్లచ్ వదిలిపెట్టాడు. బండి చిన్న జర్క్ ఇచ్చి స్కిడ్ అయి కిందపడింది. ఆ తరువాత ఏమైందో మీరు వీడియోలో చూడుండ్రి.