29.6 C
Hyderabad
Wednesday, January 27, 2021

తెలుగుకు అధికార భాషా హోదా.. బెంగాల్ సీఎం మమత నిర్ణయం

తెలుగుకు అధికార భాష హోదా ఇస్తూ.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు వారిని బెంగాల్ రాష్ట్రంలో భాషాపరమైన మైనారిటీలుగా గుర్తిస్తూ సీఎం మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజల ఓట్లను ఆకర్షించేందుకు మమత ఈ పని చేసిందంటూ విపక్షాలు మండి పడుతున్నాయి.

రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వేలాది మంది తెలుగువారు అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఖరగ్‌పూర్‌ బల్దియాలోని 35 వార్డుల్లో ఆరుచోట్ల తెలుగు వారే కౌన్సిలర్లుగా గెలిచారు. పలు పార్టీల్లోనూ తెలుగు వారు కీలక హోదాల్లో ఉన్నారు. అయితే తెలుగుకు అధికార భాష హోదా ఇవ్వాలని వారంతా చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయాన్ని బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థచటర్జీ తెలిపారు. హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా తదితర భాషలకు ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం అధికార భాష హోదా ఇచ్చింది. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

గణతంత్ర దినోత్సవం రోజున.. రణతంత్ర ర్యాలీ!

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసి.. పలు హింసాత్మక ఘటనలకు కారణమయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ, మూడు సాగు చట్టాలను...

రూ.4500 కోట్లు ఆర్జించిన ఓటీటీలు

దేశ వ్యాప్తంగా ఉన్న 30కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు గతేడాది రూ.4500 కోట్లు ఆర్జించాయని ఈవై ఫిక్కి ఇండియన్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఓటీటీల వ్యాపార విలువ...

చోప్రా లైఫ్ జర్నీ.. షేర్ చేసిన అమితాబ్

పీకే, త్రీ ఇడియట్స్, సంజు, లగేరహో మున్నాభాయ్, మున్నా భాయ్ ఎంబీబీఎస్, మిషన్ కశ్మీర్, ఖామోష్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా...

తొలి రౌండ్‌లో పోరాడి ఓడిన సింధు

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్ లో బరిలోకి దిగిన ఆరోసీడ్‌ సింధుకు తొలి రౌండ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-బిలో వరల్డ్‌ నంబర్‌ వన్‌ తై జు యింగ్‌(చైనీస్‌...