18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

ముగిసిన అఖిలప్రియ కస్టడీ.. కీలక సమాచారం రాబట్టిన పోలీసులు

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణలో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. మూడు రోజుల్లో మొత్తం 30 గంటలు విచారించిన పోలీసులు.. అఖిల ప్రియను 300 ప్రశ్నలు అడిగారు. కిడ్నాప్ సమయంలో ప్రవీణ్ రావు నివాసం దగ్గర భార్గవ్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు విచారణలో నిర్ధారించారు. కూకట్‌పల్లిలోని ఓ లాడ్జిలో కిడ్నాపర్ల కోసం భార్గవ్ బస ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు.

కిడ్నాప్ చేసిన ముగ్గురిని (నవీన్, సునీల్, ప్రవీణ్) నిందితులు  చిలుకూరు దగ్గరలోని ఫామ్‌హౌస్‌లో బంధించారు. నవీన్, సునీల్‌తో డాక్యుమెంట్ల మీద భార్గవ్ సంతకాలు పెట్టించుకున్నాడు. అయితే డాక్యుమెంట్ల మీద  ఆళ్లగడ్డ అని ఉండడంతో ప్రవీణ్ రావు సంతకం చేసేందుకు నిరాకరించాడు. అంతలోనే కిడ్నాప్ వ్యవహారం పోలీసులకు తెలిసిందంటూ అఖిల ప్రియ భార్గవ్‌కు ఫోన్ చేసి చెప్పిందని పోలీసులు గుర్తించారు. అఖిల ప్రియ ఫోన్ కాల్ తో అలర్ట్ అయిన కిడ్నాపర్లు.. ముగ్గురినీ మొయినాబాద్‌లో వదిలేశారు. కిడ్నాప్ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా గంటల వ్యవధిలోనే కిడ్నాప్‌ కేసును చేధించారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే కిడ్నాప్‌నకు అసలు సూత్రధారులు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్, వీరి అనుచరుడు గుంటూరు శ్రీను అని నిర్ధారించుకున్న పోలీసులు అఖిల ప్రియను అరెస్ట్ చేశారు. అఖిల భర్త భార్గవ్, గుంటూరు శ్రీను ఇంకా పరారీలోనే ఉన్నారు. అఖిల ప్రియను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. కిడ్నాప్ కేసులో విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. దాంతో కోర్టు అఖిల ప్రియను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది.

తృటిలో తప్పించుకున్న గుంటూరు శ్రీను..

ఇదిలాఉంటే.. పరారీలో ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్, అతని అనుచరుడు గుంటూరు శ్రీను కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లోనూ గాలింపును ముమ్మరం చేశారు. గుంటూరు శ్రీను పుణెలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి  చేరుకున్నారు. పోలీసుల రాకను పసిగట్టిన శ్రీను అక్కడిని తప్పించుకున్నాడు.

- Advertisement -

Latest news

Related news

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...