26.6 C
Hyderabad
Sunday, January 24, 2021

14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు అఖిలప్రియ

బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ పోలీసు కస్టడి ముగిసింది. ఏ1 నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు పోలీసులు గాంధీ ఆస్పత్రిలో కరోనాతో పాటు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టుకు సెలవు ఉండటంతో ఆమెను సికింద్రాబాద్‌లోని న్యాయమూర్తి నివాసంలో హాజరు పర్చారు. మూడు రోజుల పాటు అఖిలప్రియను బేగంపేట మహిళ పోలీసుస్టేషన్‌లో విచారించారు. విచారించిన స్టేట్‌మెంట్‌ను పోలీసులు న్యాయమూర్తికి అందజేశారు. పోలీసుల నివేదిక పరిశీలించిన న్యాయమూర్తి అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. అనంతరం ఆమెను చంచల్‌గూడ మహిళ జైలుకు తరలించారు. అఖిలప్రియకు బెయిల్‌ ఇవ్వాలని ఆమె తరపున న్యాయవాదులు కోరారు. కాగా.. ఈ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు శనివారం విచారణ జరపనుంది.

- Advertisement -

Latest news

Related news

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...