29.3 C
Hyderabad
Monday, March 1, 2021

దేశంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహం.. ఎక్కడంటే..

త్వరలోనే దేశంలో అత్యంత ఎత్తైన బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహం తయారీ పనులు చకచకా జరుగుతున్నాయి. బెంగాల్ కు చెందిన మింటూ పాల్ అనే వ్యక్తి దీన్ని తయారు చేస్తున్నాడు. మట్టితో తయారు చేస్తున్న ఈ ఎత్తైన బుద్ధ విగ్రహానికి చాలా ప్రత్యేకతలున్నాయి.


అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని 2022లో బీహార్ లోని బోధ్ గయాలో ఉన్న ప్రముఖ బౌద్ధ ఆలయంలో ఏర్పాటు చేయనున్నారు. దీన్ని తయారు చేస్తున్న మింటూ పాల్నే గతంలో కోల్‌కతాలోని 80 అడుగుల దుర్గా విగ్రహాన్ని కూడా తయారు చేశాడు. మట్టి, ఫైబర్ సమ్మేళనంతో తయారు చేస్తున్న ఈ విగ్రహం పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది బుద్ధ పూర్ణిమ కల్లా ఇది పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news