29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

సీఎం ప్రోగ్రాంలో బిర్యానీ.. హెల్త్ మినిస్టర్‌తోపాటు 145 మందికి అస్వస్థత

అసోంలోని ఓ ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ అకడమిక్‌ సెషన్‌ను మంగళవారం సీఎం సర్బానంద సోనోవాల్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 8 వేల మందికి బిర్యానీ పాకెట్లను సరఫరా చేశారు. బిర్యానీ తిన్న దాదాపు 145 మంది అస్వస్థతకు గురైయ్యారు. ఇదే ప్రోగ్రాంలో పాల్గొన్న అసోం హెల్త్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ కూడా అస్వస్థతకు గురికావడంతో ప్రస్తుతం ఆయన దిపు మెడికల్‌ కాలేజ్‌లో చికిత్స పొందుతున్నారు. బిర్యానీ తీసుకున్న అనంతరం తాను కూడా అనారోగ్యానికి గురయ్యానని.. ఇప్పుడు కోలుకున్నానని, ఇప్పటివరకు 28 మంది డిశ్చార్జి అయ్యారని మినిస్టర్ చెప్పారు.

ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించామని కర్బి అంగ్లాంగ్‌ డిప్యూటీ కమిషనర్‌ చంద్ర ధ్వజ సింఘ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిర్యానీ తిని అస్వస్థకు గురైన ఓ వ్యక్తి తాజాగా చికిత్స పొందుతూ మరణించడం కలకలం రేపింది.  అయితే ఫుడ్‌ పాయిజన్‌తోనే ఆయన మరణించారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపామని.. రిపోర్టులు అందాల్సి ఉందన్నారు.

- Advertisement -

Latest news

Related news