29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు

నాంపల్లి స్పెషల్ కోర్టు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గతంలో రాజాసింగ్ మీద కేసు నమోదైంది. 2016లో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ సందర్భంలో.. ఓయూలో బీఫ్ ఫెస్టివల్ చేస్తే.. ఓయూ మరో దాద్రి అవుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో రాజాసింగ్ మీద 295A సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా విచారణ చేపట్టిన నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. రాజాసింగ్ కు ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

- Advertisement -

Latest news

Related news