17 C
Hyderabad
Monday, March 1, 2021

కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో బోట్ దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో ఆయిల్ లీక్ అవడంతో మోటర్ ఆన్ చేసే సమయంలో బ్యాటరీ వైర్ టచ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో బోట్ దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు మత్స్యకారులు గాయపడ్డారు. ఇందులో ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి ఫిషరీస్ జేడీ, పోర్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్, సిబ్బంది చేరుకోని మంటలను ఆర్పడంతోపాటు స్థానికులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అర్బన్ ఎమ్మార్వో సతీష్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావును ఆదేశించారు.

- Advertisement -

Latest news

Related news