పర్యాటకులు హుగ్లీ నదిలో ప్రయాణిస్తూ.. కోల్‌కతా ఆందాలను వీక్షించడంతోపాటు పుస్తకాలు చదువుకునేలా ‘యంగ్ రీడర్స్ లైబ్రెరీ’ పేరుతో బోటు లైబ్రెరీని ప్రారంభించారు. హెరిటేజ్ బుక్ స్టోర్‌తో కలిసి పశ్చిమబెంగాల్ ప్రభుత్వ రవాణా సంస్థ ఈ బోటు లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఇందులో ఇంగ్లిష్, బెంగాలీ భాషలకు సంబంధించిన దాదాపు 500 బుక్స్ అందుబాటులో ఉన్నాయి.
మిలీనియం పార్క్ నుంచి బేలూర్ మఠ్ వరకు 3 గంటలపాటు సాగే ఈ బోటు లైబ్రెరీలో వెళ్లి వచ్చేందుకు పెద్దలకైతే రూ.100, పిల్లలకైతే రూ.50 చార్జిగా నిర్ణయించారు. బోటు లైబ్రెరీలో ఉచిత వైఫై సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు స్టోరి టెల్లింగ్, డ్రమటైజ్డ్ రీడింగ్స్, పోయెట్రీ సెషన్స్, బుక్ లాంచెస్, సంగీతం లాంటి ప్రోగ్రామ్స్ లను కూడా పర్యాటకులు ఎంజాయ్ చేయొచ్చు.