29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

మోదీ మన్ కీ బాత్ లో ‘బోయిన్ పల్లి మార్కెట్’ ప్రస్తావన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో కీలక అంశాలతోపాటు మన బోయిన్ పల్లి ప్రస్తావన తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌లో రోజూ 10 టన్నుల మేర కూరగాయలు వృధా అవుతున్నాయని మోదీ చెప్పుకొచ్చారు. వృధా అవుతున్న కూరగాయల నుంచి విద్యుత్, బయో ఇంధనాన్ని తయారు చేస్తున్నారని మోదీ ప్రశంసించారు. బోయిన్‌పల్లి మార్కెట్‌ వినియోగానికి ఆ విద్యుత్‌ను వినియోగిస్తున్నారని మెచ్చుకున్నారు. వేస్ట్ నుంచి వెల్త్ ను సృష్టించారని.. ఇలాంటి అద్భుతాలను సృష్టించడం ఆత్మనిర్భర్ భారత్‌కు నిదర్శనమని మోదీ చెప్పారు.

ఈ నెల 26న న్యూఢిల్లీలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు తనను తీవ్రంగా బాధపెట్టాయని మోడీ అన్నారు. 15 రోజుల్లో 30 లక్షల మందికి పైగా కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇచ్చామని గుర్తు చేశారు. అర్జెంటీనా ప్రెసిడెంట్ దేశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రామాయణంలోని సంజీవినితో పోల్చారని మోదీ గుర్తు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియా క్రికెట్ జట్టు తొలి టెస్ట్ ఓటమి తర్వాత పుంజుకొని సిరీస్‌ను గెలిచిందని చెప్పారు. మోదీ స్పందనకు బీసీసీఐ ట్విటర్లో థ్యాంక్స్ చెప్పింది.

- Advertisement -

Latest news

Related news