29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

బాంబు బెదిరింపు.. రూ.కోటి డిమాండ్..

శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులోని డెకత్లాన్ స్పోర్ట్స్ స్టోర్ రూమ్ లో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్ విమానాశ్రయంలో కలకలం లేపింది. కోటి రూపాయలు ఇవ్వకపోతే.. రిమోట్ నొక్కి బాంబు పేలుస్తామంటూ ఫోన్ కాల్ సారాంశం. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు.. ఉద్యోగులను, కస్టమర్లను బయటకు పంపారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ బృందం బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టింది. విస్తృత తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్ బృందం బాంబు లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు.. ఫోన్ నెంబర్ ఆధారంగా కాల్ చేసిన యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Latest news

Related news