32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

బడ్జెట్ 2021 లైవ్ అప్ డేట్స్

పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. మోదీ హయంలో 9వ సారి ప్రవేశ పెడుతుండటం విశేషం.

ఆర్థిక మంత్రి ప్రసంగంలోని హైలెట్స్…

* 2021-22 బడ్జెట్ అంచనా మొత్తం 34.83 లక్షల కోట్లు. వచ్చే ఆర్థిక కాలంలో రూ.12 లక్షల కోట్లు అప్పులు తెచ్చేందుకు నిర్ణయం.

* 6.48 కోట్లకు చేరిన ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య.

* గతేడాది మాదిరిగానే ఆదాయపు పన్ను శ్లాబులు, ఆదాయపు పన్ను.

* ఎన్ఆర్ఐలకు డబుల్ టాక్సేషన్ నుంచి మినహాయింపు.

* జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా 15 వేల పాఠశాలలు ఆధునీకరణ.

* జాతీయ అంప్రెంటీస్ చట్టానికి సవరణలు.

* ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన స్కీం మరో ఏడాది పొడిగింపు. మార్చి 2022 వరకూ గృహాల కొనుగోలుపై రాయితీలు పొందొచ్చు. 

* తేయాకు తోటల కార్మికుల కోసం రూ.1000కోట్లు కేటాయింపు. 

* గగన్‌యాన్‌ కోసం రష్యాలో శిక్షణ పొందుతున్న నలుగురు భారత వ్యోమగాములు.

* రాత్రి వేళల్లో కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళలకు పూర్తి రక్షణ.

* భవన నిర్మాణ కార్మికుల కోసం పోర్టల్‌.

* పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు.  

* పన్నుల వ్యవస్థ సరళీకరణ.. వివాదాల పరిష్కరానికి ప్రత్యేక కమిటీ.

* సామాజిక భద్రత పథకాల్లోకి వీధి వ్యాపారులు.

* గోవా డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు రూ.300కోట్లు.

* డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ.1,500కోట్లు. 

* డిజిటల్‌ విధానంలో జనాభా లెక్కల సేకరణ. 

* 75ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఫైలింగ్‌ నుంచి మినహాయింపు.

* వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.16.5లక్షల కోట్లు.

* 1000 మండీలను ఈనామ్‌తో అనుసంధానం.

* రూ.50లక్షల నుంచి రూ.2కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలుగా గుర్తింపు.

* రూ.5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి.

* ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు.

* ఆదివాసీ ప్రాంతాల్లో 750 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు.

* పరిశోధనా, నాణ్యత, మెరుగుదల కోసం జపాన్‌తో ఒప్పందం.

* ఉన్నత విద్యా పర్యవేక్షణకు స్పెషల్ కమిషన్‌. లేహ్‌లో సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటు.

* పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ సిస్టంలో మార్పులు.

* రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెరుగుతుంది.

* 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ.

* 2021-22ఆర్థిక సంవత్సరంలో బీపీసీఎల్‌, ఎయిర్‌ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి.

* మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు.

* బ్యాంకుల నిర్థరక ఆస్తులపై కీలక నిర్ణయం. ఆర్థిక వ్యవస్థ కోసం మంచి బ్యాడ్‌ బ్యాంక్‌

* ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం.

* గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ.

* స్టార్టప్‌లకు చేయూత కోసం మరిన్ని ప్రోత్సాహలు.

* ప్రభుత్వ పింఛన్లు పెట్టుబడుల ఉపసంహరణ మరింత వేగవంతం.

* పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000కోట్లు సేకరణ.

* 15 ఎమర్జెన్సీ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటు.

* పట్టణాల్లో నీటి సమస్య పరిష్కారానికి జల్‌ జీవన్‌ అభియాన్‌.

* నేషనల్‌ ఫస్ట్ తో రైతుల ఆదాయం రెట్టింపు. మహిళా సాధికారత, యువత ఉపాధికి అధిక ప్రాధాన్యం.

* మెగా టెక్స్ టైల్స్‌ పార్కుల నిర్మాణం, రానున్న మూడేండ్లలో 7 టెక్స్ టైల్‌ పార్కులు

* కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ.35వేల కోట్లు.

*భారత్‌తో పాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్‌ అందిస్తాం.

*ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్రోత్సాహకాల్లో భాగంగా రూ.1.97 కోట్లతో ప్రత్యేక నిధి.

* అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థారణ కేంద్రాలు.

*రూ.18వేల కోట్లతో బస్‌ట్రాన్స్‌ పోర్ట్‌ స్కీమ్.

* మెట్రో లైట్‌, మెట్రో నియో పథకాలు.

* కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం.

* చెన్నై మెట్రోకు రూ.63,246కోట్లు.

*విద్యుత్‌ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ సంస్థలు. హైడ్రోజన్‌ ఎనర్జీపై ప్రత్యేక ఫోకస్. రూ.3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం.

* ఇండియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి రూ.1624 కోట్లు. నౌకల రీసైక్లింగ్‌ సామర్థ్యం పెంపు.

* జమ్మూకశ్మీర్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌. మరో కోటి మందికి ఉజ్వలసాయం.

* జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌ బోర్డు.

* రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ.2లక్షల కోట్లు.

* ఈ ఏడాది ఎల్ ఐసీ ఐపీఓ.

* రూ.19 వేల కోట్లతో అసోంలో జాతీయ రహదారుల నిర్మాణం.

* 15 ఏండ్ల పైబడిన వాహనాలను తుక్కు కింద మార్చే పథకానికి కేంద్రం ఆమోదం.

* బీమా కంపెనీల్లో ఎఫ్ డీలు 74 శాతానికి పెంపు.

* బెంగళూరు మెట్రోకి రూ.14778 కోట్లు కేటాయింపు.

* వాయిు కాలుష్య నియంత్రణకు రూ. 2217 కోట్లు.

* కొత్తగా నగర్ స్వచ్ఛ్ భారత్ ప్రోగ్రామ్.

* విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు.

* 1938 బీమా చట్టానికి సవరణ.

* విజయవాడ-ఖరగ్ పూర్ మధ్య ఈస్ట్ కోస్ట్ గూడ్స్ కారిడార్.

* దేశంలోని నాలుగు ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబులు.

* వచ్చే మూడేండ్లలో 100 జిల్లాలకు గ్యాస్ పైప్ లైన్లు.

* ఈ ఏడాది రైల్వేలకు రూ.1.10 లక్షల కోట్లు కేటాయింపు.

* తమిళనాడులో 3500 కి.మీ. జాతీయ రహదారుల విస్తరణ.

* భారత్ మాల కింద కొత్తగా 13 వేల కి.మీ. జాతీయ రహదారుల ఏర్పాటు.

* పశ్చిమ బెంగాల్లో రూ.95 వేల కోట్లతో డెవలప్ మెంట్ పనులు.

* కొత్తగా 17 వేల అర్బన్, రూర్బన్ హెల్త్ సెంటర్లు.

* స్వచ్ఛ భారత్ మిషన్ కోసం రూ.1.47 లక్షల కోట్లు.

* పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలపై బడ్జెట్ లో స్పెషల్ ఫోకస్

* 2023 నాటికల్లా రైల్వే లైన్ల విద్యుతీకరణ పూర్తి.

* 500 నగరాల్లో మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు.

* వైద్యారోగ్యానికి అధిక ప్రాధాన్యత. రూ.2.23 లక్షల కోట్లు కేటాయింపు.

* 5 ప్రత్యేక జాతీయ రహదారుల డెవలప్ మెంట్ కు రూ.5 వేల కోట్లు కేటాయింపు.

* కేరళకు రూ.65 వేల కోట్లతో ప్రత్యేక డెవలప్ ఫండ్.

3వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

పార్లమెంట్ లో 3వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ 2021- మేడిన్ ఇండియా ట్యాబ్ లో 2021-22 బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్న ఆర్ధిక మంత్రి.

జోష్ మీదున్న స్టాక్ మార్కెట్లు

కేంద్ర బడ్జెట్ 2021 నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో దూసుకుపోతున్నాయి.  ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్‌తో సహా అన్నీ కూడా లాభాల్లో పయనిస్తున్నాయి.

ఈ ఏడాది పేపర్‌లెస్ బడ్జెట్

కరోనా కారణంగా బడ్జెట్‌ పత్రాల ముద్రణ చేపట్టకూడదని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు ఉభయసభల సభ్యులు కూడా సమ్మతించడంతో ప్రింటింగ్‌ చేపట్టలేదు. సభ్యులందరికీ బడ్జెట్‌ సాఫ్ట్‌ కాపీలు ఇవ్వనున్నారు.1947 నవంబరు 26న తొలి కేంద్ర బడ్జెట్‌ నుంచి ఏటా బడ్జెట్‌ పత్రాల ముద్రణ చేపడుతున్నారు.

- Advertisement -

Latest news

Related news