ఈనెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ వెల్లడించింది.
రెండు దశల్లో..
బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో నిర్వహించనున్నారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు తొలి దశ.. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశలో సమావేశాలు ఉంటాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా బడ్జెట్ సెషన్స్ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.