29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఇంటి బడ్జెట్.. ఇలా ఉండాలి!

ఇప్పుడంతా బడ్జెట్ గురించే టాపిక్. సెంట్రల్ బడ్జెట్ మాటేమో గానీ మన ఇంటి బడ్జెట్ ఎలా ఉండాలో ఎప్పుడైనా ఆలోచించారా?

కుటుంబంలో కూడా వచ్చిన ఆదాయాన్ని బట్టి లెక్కల పద్దు రాసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని ఎలా ప్లాన్ చేయాలంటే…
వచ్చిన ఆదాయాన్ని ప్రస్తుత అవసరాలకు, ఫ్యూచర్ ఖర్చులకూ, సేవింగ్స్ కు ఇలా రకరకాల ప్రయోజనాలకు ఉపయోగపడేలా లెక్కేసుకోవడమే బడ్జెట్. అది ఇల్లు అయినా దేశం అయినా ఇలానే లెక్కించాలి. సరే మన ఇంటి బడ్జెట్ విషయానికొస్తే..

మూడు భాగాలుగా..
బడ్జెట్ వేసేటప్పుడు అది లాంట్ టర్మ్ లో ఉపయోగపడేలా ప్లాన్ చేయాలి. సొంతిల్లు, పిల్లల చదువులు, పెళ్లిల్లు.. ఇలాంటివి పెద్ద పెద్ద ఖర్చులను ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేయాలి. అలాగే కారు, బైకు, టూర్స్ ఇలాంటివి మిడిల్ టర్మ్ ప్లాన్స్. ఇప్పుడు కావాల్సిన ఇంటి అవసరాలు, రోజువారి ఖర్చులు, నెలాఖరికి వచ్చే బిల్లులు ఇవన్నీ ప్రస్తుత అవసరాలు. ఇలా ఆదాయాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకుని బడ్జెట్ ప్లాన్ చేయాలి.

సేవింగ్స్ అంటే..
సేవింగ్స్ అంటే చాలామంది ఖర్చులు పోనూ మిగతాది అనుకుంటారు. కానీ అసలు సేవింగ్స్ ఎంత ఉండాలి అనేది మనమే డిసైడ్ చేయాలి. భవిష్యత్తులో మన లక్ష్యం ఏంటి?, అది వాస్తవంలోకి రావడానికి ఎంత దాయాలి అనేది చూసుకోవాలి. ఎక్కువ అవసరం అవుతుంటే ఆదాయాన్ని పెంచుకునే ఆలోచనలు చేయాలి. ముందుగా ప్లాన్ చేసి దాచాల్సిందే సేవింగ్స్ అంటే.

అత్యవసర నిధి
ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర అత్యవసర నిధి ఉండాలి. కనీసం మూడు నెలలు ఆదాయం లేకపోయినా బతకగలిగేలా ఈ నిధిని సమకూర్చాలి. కరోనా లాంటి ప్యాండెమిక్స్ మళ్లీ వస్తే ఇవే మనల్ని గట్టెక్కిస్తాయి.

కోరిక.. అవసరం..
ఖర్చు చేసే ప్రతిసారి అది అవసరమా? లేదా అది మన కోరికా అనేది చెక్ చేసుకోవాలి. కోరికల కోసం చేసే ఖర్చు.. అవసరాల కోసం చేసే ఖర్చు కంటే ఎక్కువ ఉండకూడదు. ముందు ప్రియారిటీ అవసరాలకు ఇవ్వాలి.

ఇకపోతే.. బడ్జెట్ వేసుకోవడమే కాదు. దాన్ని పక్కాగా అమలు చేయడం చాలా ముఖ్యం. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే.. ఒక్కోసారి అప్పులు చేయాల్సొస్తుంది. అందుకే ఖర్చుల్ని అదుపులో ఉంచుకుంటూ.. ఆదాయానికి తగ్గట్టుగా సర్దుబాటు చేయాలి.

- Advertisement -

Latest news

Related news