29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

సిక్స్ పిల్లర్ బడ్జెట్.. వీటికే ఇంపార్టెన్స్

అందరూ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూసిన బడ్జెట్ రానే వచ్చింది. నిన్న ప్రకటించిన బడ్జెట్ లో కొన్ని లాభాలున్నాయి. కొన్ని నష్టాలున్నాయి. అయితే ఈ బడ్జెట్ చాలామందికి నిరాశే కలిగించిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగులకి, నిరుద్యోగులకి, రైతులకు, మధ్యతరగతికి మొండిచేయి చూపించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


దేశం అభివృద్ధిలో పరుగులు పెట్టేందుకు ఆరు కీలక రంగాలు పునాదులుగా ‘సిక్స్‌ పిల్లర్‌ బడ్జెట్‌’ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌..


ఆరోగ్యం: ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. వ్యాధి నివారణ, చికిత్స, బాగోగులే లక్ష్యంగా పెట్టుకున్నారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రూ.35,000 కోట్లు ప్రకటించారు.
పీఎల్‌ఐ: ఉత్పత్తి సంస్థలు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భాగస్వాములు అయ్యేలా ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఐదేళ్లలో రూ.1.97 లక్షల కోట్లు కేటాయించారు.
వ్యవసాయం: వ్యవసాయ రుణ పరిమితిని పెంచారు. పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ రంగాలకు ప్రోత్సాహకాలు.
విద్య: దేశంలో కొత్తగా 100 సైనిక స్కూళ్లు. గిరిజన ప్రాంతాల్లో 750 ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు. అప్రెంటిస్‌షిప్‌ చట్టం.
పరిశోధనలు: కొత్త ఆవిష్కరణలు, రీసెర్చ్, డెవలప్ మెంట్ రంగాలకు వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్ల కేటాయింపు. డిజిటల్‌ పేమెంట్స్ ప్రోత్సాహానికి రూ.1,500 కోట్లు.
కనిష్ట ప్రభుత్వం – గరిష్ట పాలన: పన్ను చెల్లింపుదారులపై ఒత్తిడి తగ్గించేలా పన్నుల విధానం. సత్వర న్యాయానికి ట్రిబ్యునళ్లలో సంస్కరణలు.

ఇవన్నీ ఫర్ సేల్..
బడ్జెట్ లో కొన్ని ప్రభుత్వ సంస్థల వాటాలను అమ్మకానికి పెట్టారు. రైల్వే లైన్లు, టోల్‌ రోడ్లు, గ్యాస్‌ పైప్‌లైన్లు, గిడ్డంగులు, క్రీడా మైదానాలు, ఎయిర్ పోర్ట్ లు.. వీటితో పాటు ఎల్‌ఐసీ, బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్, కంటెయినర్‌ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్ లాంటి వాటిలో వాటాలను విక్రయించబోతున్నారు. ఓ రెండు బ్యాంకుల ప్రైవేటు రంగం చేతుల్లోకి వెళ్లబోతున్నాయి.


ముఖ్యమైన మార్పులివి
ఈ బడ్జెట్ వల్ల మధ్య తరగతి వారికోసం పీఎంఏవై పథకం మరో ఏడాది పొడిగించారు. అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించే సంస్థలకు పన్ను విరామం ఇచ్చారు.
రైతుల కోసం దేశవ్యాప్తంగా అయిదు వ్యవసాయ హబ్‌ల ఏర్పాటు చేయనున్నారు.. రైతులకు రూ.16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. వెయ్యి వ్యవసాయ మార్కెట్లను ఈనామ్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు.
విద్యార్థుల కోసం దేశంలోని 15 వేల ప్రభుత్వ పాఠశాలల మోడ్రనైజ్ చేయనున్నారు. ఏకలవ్య పాఠశాలల కోసం రూ.40 కోట్లు కేటాయింపు. 100 కొత్త సైనిక పాఠశాలల ఏర్పాటు.
విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఇంకు కాట్రిడ్జిలు, సెల్‌ఫోన్‌ విడిభాగాలు,కనెక్టర్లు, బ్యాక్‌ కవర్‌, ఛార్జర్లపై కస్టమ్స్‌ సుంకం పెంచనున్నారు. దీంతో వాటి ధరలు పెరుగుతాయి.
కేవలం పింఛను, డిపాజిట్ల వడ్డీపై ఆధారపడి జీవించే 75 ఏళ్లు దాటిన వృద్ధులు ఇకపై ఎలాంటి రిటర్నులు సమర్పించాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతాల్లోనే వారి పన్ను మొత్తాన్ని మినహాయిస్తారు.
మరో కోటి మందికి ఉజ్వల గ్యాస్‌ పథకం. ఎక్కడి నుంచైనా రేషన్‌ తీసుకునే వీలు. 32 రాష్ట్రాల్లో వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు అమలు.
యాపిల్స్, పీస్, పప్పు ధాన్యాలు, ఆల్కహాల్, కెమికల్స్, వెండి, పత్తి లాంటి కొన్ని ఉత్పత్తుల దిగుమతులపై అగ్రి సెస్‌ (అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌)ను విధించారు.

- Advertisement -

Latest news

Related news