28.2 C
Hyderabad
Sunday, January 17, 2021

హథ్రాస్ ఘటనపై సీబీఐ చార్జిషీట్.. రేప్ చేసి చంపేశారని నివేదిక

దేశంలో సంచ‌ల‌నం రేపిన హ‌థ్రాస్ అత్యా‌చార ఘ‌ట‌నపై ఈరోజు సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేసింది. న‌లుగురు వ్యక్తులు కలిసి దళిత యువతిని గ్యాంగ్ రేప్ చేసి చంపేసినట్లు సీబీఐ త‌న చార్జిషీట్‌లో పేర్కొంది. సెప్టెంబ‌ర్‌ నెలలో యూపీలోని హ‌థ్రాస్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  నిందితుల‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద అభియోగాలు న‌మోదు చేశారు. ఈ ఘటనపై హ‌థ్రాస్‌లోని కోర్టులో సీబీఐ త‌న చార్జిషీట్‌ను దాఖ‌లు చేసింది.  సెప్టెంబ‌ర్ 14వ తేదీన ఉన్నత కులానికి చెందిన న‌లుగురు వ్యక్తులు ద‌ళిత యువతిని రేప్ చేశారు. అయితే ఢిల్లీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ ఆ యువ‌తి ప్రాణాలు విడిచింది.  సెప్టెంబ‌ర్ 30వ తేదీన ఆమె మృత‌దేహానికి పోలీసులు అర్థరాత్రి హడావుడిగా ద‌హ‌న సంస్కారాలు నిర్వహించారు.  రాత్రికి రాత్రే ద‌హ‌న సంస్కారాలు నిర్వహించ‌డం ప‌ట్ల దేశ‌వ్యాప్త వ్యతిరేకత వచ్చింది. సంస్కారాలు కుటుంబ స‌భ్యుల ఇష్టం మేర‌కే దహన సంస్కారాలు జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో సీబీఐ విచార‌ణకు ఆదేశించిన త‌ర్వాత‌.. అల‌హాబాద్ హైకోర్టు సీబీఐ ద‌ర్యాప్తును ప‌ర్యవేక్షించ‌నున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.  ఈ కేసులో అరెస్టు అయిన న‌లుగురు నిందితులు నిర్దోషుల‌మంటూ యూపీ ప్రభుత్వానికి లేఖ రాశారు.  ఆ యువ‌తి త‌ల్లితండ్రులు, సోద‌రుడు ఆమెను వేధించిన‌ట్లు నిందితులు ఆరోపించారు. కానీ ఆ యువ‌తి కుటుంబ సభ్యులు ఆ ఆరోపణలను ఖండించారు. అయితే ఈ కేసులో విచార‌ణ‌ను పూర్తి చేసేందుకు మ‌రింత స‌మ‌యం కావాల‌ని సీబీఐ అల‌హాబాద్ హైకోర్టును కోరింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ జ‌న‌వ‌రి 27కి వాయిదా పడింది.

- Advertisement -

Latest news

Related news

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ...

తాళిబొట్టు తీసుకొచ్చిన డ్రోన్.. వీడియో వైరల్..

మామూలుగా పెళ్లిళ్లలో గాలిలో డ్రోన్ తిరుగుతూ వేడుకలన్నీ పై నుంచి షూట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అదే డ్రోన్ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి వరుడి చేతికందిస్తే.. ఆ విజ్యువల్...

కాల్పుల వర్షం కురిపించే ఫైరింగ్‌ షూ

మామూలుగా సైనికులు తుపాకులతో శత్రవులపై కాల్పులు జరుపుతారు. అవే కాల్పులు షూస్‌తో జరిపితే ఎలా ఉంటుంది. చేతిలో తుపాకీ పట్టుకోకుండా కాలికి ధరించిన చెప్పులతోనే బుల్లెట్ల వర్షం కురిపిస్తే శత్రువు...