29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

మే 4 నుంచి సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్స్

సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు మే 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ విడుదల చేశారు. క్లాస్ 10 పరీక్షలు జూన్ 7న.. క్లాస్ 12 పరీక్షలు జూన్ 11న ముగియనున్నాయి. ప్రాక్టికల్స్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి.

ఆఫ్ లైన్ మెథడ్ లో జరిగే ఈ పరీక్షలు కోవిడ్ జాగ్రత్తల నడుమ నిర్వహించనున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు మాస్కులు ధరించడంతోపాటు హ్యాండ్ శానిటైజర్లను తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే 30 శాతం సిలబస్ ని తగ్గించారు. 33 శాతం ఇంటర్నల్ ఛాయిస్ ప్రశ్నలు అడగనున్నారు. పరీక్షల ఫలితాలను జులై 15న వెల్లడించనున్నారు.

- Advertisement -

Latest news

Related news