ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్(11, 12 క్లాసులు) ఎగ్జామ్స్ షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిషాంక్ చెప్పారు. 2021 బోర్డు పరీక్షలు రాతపూర్వకంగానే ఉంటాయని.. ఆన్లైన్ లో ఉండవన్నారు. ప్రాక్టికల్స్ కు హాజరుకాలేని వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. మే, జూన్ నెలల్లో సీబీఎస్ఈ ఎగ్జామ్స్ నిర్వహించి వాటి ఫలితాలను జూలై 15న ప్రకటిస్తామని గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి చెప్పిన విషయం తెలసిందే.