32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

గ్యాస్ సబ్సిడీలకు కేంద్రం మంగళం!

చమురు ధరలపై క్రమంగా ప్రభుత్వ నియంత్రణను ఎత్తేస్తూ సామన్యులకు పగలే చుక్కలు చూపుతున్న బీజేపీ ప్రభుత్వం మరోసారి ప్రజలకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్, కిరోసిన్ సబ్సిడీని క్రమంగా ఎత్తేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి.

2019-20 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం సబ్సిడీ కోసం రూ.40 వేల కోట్లు కేటాయించింది. కాగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి మాత్రం రూ.12995 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కేంద్రం పెట్రోలియం సబ్సిడీ కేటాయింపులు తగ్గించడం కారణంగా కిరోసిన్, గ్యాస్ సబ్సిడీకి కోత పెట్టడం లేదా భారీగా తగ్గంచడం ఖాయమన్నట్లు విన్పిస్తోంది.

ఇండియాలో ప్రస్తుతం 28 కోట్ల ఎల్‌పీజీ వినియోగదారులు ఉన్నారు. వీరిలో దాదాపు 20 కోట్ల మంది గ్యాస్ సబ్సిడీ పొందుతున్నారు. ప్రస్తుతం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) స్కీంలో భాగంగా అల్పాదాయ వర్గాలకు ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద అందజేస్తోంది. ఈ అర్థిక సంవత్సరంలో మరో 8 కోట్ల మందికి కొత్తగా ఉజ్వల స్కీం కింద సబ్సిడీ సిలిండర్లను ఇవ్వనున్నట్లు తాజా బడ్జెట్లో కేంద్రం ప్రకటించడం గమనార్హం.

- Advertisement -

Latest news

Related news