29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

సాగుచట్టాలపై ముగిసిన తొమ్మిదో విడత చర్చలు

సాగు చట్టాలను రద్దు చేయాలని ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం తొమ్మిదో విడత చర్చలు జరిపింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు ముగిశాయి. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఈ భేటీ జరుగుతుండటంతో.. సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. ఈసారి కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు.
మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేస్తుండగా.. చట్టాలను ఉపసంహరించుకునే వరకు మా పోరాటం ఆగదని రైతులు అంటున్నారు. ఈ సమావేశంలో కనీస మద్దతు ధర, నిత్యావసర వస్తువుల చట్టం వంటి కీలకాంశాలపై చర్చలు జరిగాయి. ఈ నెల 19వ తేదీన మరోసారి కేంద్రం రైతులతో చర్చలు జరపాలని నిర్ణయించింది.

- Advertisement -

Latest news

Related news