26 C
Hyderabad
Wednesday, January 27, 2021

ఆరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం.. రాతపూర్వక హామీ ఇస్తేనే సరే అంటున్న రైతులు

వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తేనే చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పారు. కేంద్రం రైతు సంఘాలను అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కేంద్రానికి రైతుల ఐక్యవేదిక పేరుతో లేఖ రాసినట్టు తెలిపారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను ఆరోసారి చర్చలకు పిలుస్తూ కేంద్ర రాసిన లేఖపై రైతు నేతలు సమావేశమై చర్చించారు

చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం ఉద్యమంతో సంబంధం లేని సంఘాలతో మాట్లాడుతోందని.. తద్వారా తమ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రైతులు చర్చలకు ఇష్టంగా లేరనే ప్రచారం అబద్ధవమని రైతు సంఘాలు స్పష్టంచేశాయి.  కేంద్రం రాతపూర్వక హామీలతో వస్తేనే.. చర్చలకు వస్తామని రైతులు తేల్చి చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనని మరోసారి డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధర విషయంలో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా చట్టం తేవాలన్నారు. చర్చలు ఫలప్రదంగా సాగేందుకు అనువైన వాతావరణాన్ని కేంద్రం సృష్టించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ప్రతిపాదనల్లో కనీస మద్దతు ధరపై ఎలాంటి స్పష్టత లేదని రైతుసంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చర్చలకు కేంద్రం రైతులను మరోసారి ఆహ్వానిస్తుందా? లేక సాగు చట్టాలు పూర్తిగా వెనక్కి తీసుకొని.. కొత్త చట్టం తెచ్చే ప్రతిపాదనలతో రావాలంటున్న రైతుల డిమాండ్‌పై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది తేలాల్సిన విషయం.

- Advertisement -

Latest news

Related news

వంటిమామిడిలో కోల్డ్ స్టోరేజ్ కడుతాం : సీఎం కేసీఆర్

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌లోని రైతులతో మాట్లాడిన సీఎం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంటి మామిడి కూరగాయల మార్కెట్లో...

మదనపల్లె జంటహత్య కేసు నిందితులకు.. 14రోజుల రిమాండ్

మదనపల్లె జంటహత్యల కేసులో నిందితులైన మృతురాళ్ల తల్లితండ్రులకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నిందితులు పద్మజ, పురుషోత్తం నాయుడులను పోలీసులు మంగళవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. కోర్టు నిందితులకు...

ఆకస్మికంగా మార్కెట్‌యార్డుకు సీఎం కేసీఆర్‌

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం అక్కడున్నరైతులతో మాట్లాడారు. పంటల సాగు, ధరలను  అడిగి...

ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి.. మంత్రి వేముల

సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత, అకుంఠిత దీక్షతో ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్నినిర్మించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన...