33.6 C
Hyderabad
Wednesday, March 3, 2021

కొత్త లేబర్ కోడ్ ప్రవేశపెట్టనున్న కేంద్రం.. తగ్గనున్న పనిదినాలు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఓ లేబర్ కోడ్ తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ మేరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఈ కొత్త కోడ్ ప్రకారం కంపెనీలు తమ ఉద్యోగులతో వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఆ నాలుగు రోజుల్లో పనిగంటలు మాత్రం 48కి తగ్గవు. ఈ మేరకు.. నాలుగు రోజుల్లో రోజుకు 12 గంటల పాటు ఉద్యోగులు పనిచేయాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ కోడ్ ను అమలు చేస్తున్నాయి. అయితే.. కొత్తగా అమల్లోకి రానున్న ఈ లేబర్ కోడ్ ను ఉద్యోగుల అనుమతితోనే కంపెనీలు అమలు చేయాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక‌, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యద‌ర్శి అపూర్వ చంద్ర తెలిపారు.


ఉద్యోగులతో వారినికి ఎన్నిరోజులు పనిచేయించుకోవాలన్నది సంస్థల ఇష్టం అని.. 4, 5, 6 ఇలా కంపెనీకి నచ్చినట్టుగా పని దినాలు పెట్టుకోవచ్చని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ తెలిపింది. త్వరలో అమల్లోకి రానున్న ఈ కొత్త కోడ్ ముసాయిదా నిబంధ‌న‌లు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ని, చాలా వ‌రకూ రాష్ట్రాలు కూడా త‌మ సొంత నిబంధ‌న‌లు రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Latest news

Related news