29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

రేపటి నుంచి థియేటర్లు 100 శాతం.. కేంద్రం అనుమతి

సినీ ప్రేమికులకు, థియేటర్ల ఓనర్లకు కేంద్రం ఓ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపించుకోవడానికి అనుమతులు ఇచ్చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వందశాతం ప్రేక్షకులతో థియేటర్లు, మల్టీప్లెక్సులు నడుపుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించింది.
గ‌తేడాది అక్టోబ‌ర్‌ నెలలోనే థియేటర్లు తెరుచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చినా.. కేవలం 50శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో.. తమకు నష్టం వస్తుందని థియేటర్ల ఓనర్లు పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. భౌతిక దూరం, శానిటైజర్లు, టెంపరేచర్, మాస్కులు వంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Latest news

Related news