వచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కొత్తగా ఓ నేషనల్ బ్యాంక్ ఏర్పాటు ప్రకటన చేయనున్నారు. దేశంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఈ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారట. పీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్ ఫండ్స్ లో కొంత మొత్తాన్ని కచ్చితంగా ఈ బ్యాంకులో డిపాజిట్ చేయాలన్న నిబంధన విధించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ బ్యాంకు మూలధనం రూ.లక్ష కోట్లు కాగా.. మొదట రూ.20 వేల కోట్లతో ప్రారంభించనున్నారట. ఈ బ్యాంకును ఓ ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆర్థిక ఇప్పటికే నివేదిక కూడా రూపొందించిందట. ఇప్పటికే దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిల్ 2020 పేరుతో రూపొందించింది. ఇప్పటికే ఉన్న ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ను ఇది రీప్లేస్ చేయనుంది.