32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

ర్యాలీపై ఆగ్రహం.. రైతుల అరెస్ట్.. ట్విట్టర్ ఖాతాలపై కన్ను

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ గా స్పందించింది. ఒకవైపు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటే.. సమీపంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించడం తీవ్రంగా పరిగణించింది.


ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న రైతులను అరెస్టు చేయమని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన 200 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిసాన్‌ పరేడ్‌ పేరుతో రిపబ్లిక్ డే నాడు రైతులు వేలాది ట్రాక్టర్లతో చేపట్టిన ర్యాలీ ప్రకటించిన ప్రకారం కాకుండా వ్యూహం మార్చి.. ఎర్రకోట వైపు దూసుకెళ్లారు. రోడ్డుకు అడ్డంగా పోలీసులు పెట్టిన బారికేడ్లు, ట్రక్కులను తోసుకుంటూ చారిత్రక కట్టడాన్ని ముట్టడించారు. ఎర్రకోటపై నిశాన్‌ సాహిబ్‌, రైతు సంఘాల జెండాలను ఎగరేశారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పలు చోట్ల అల్లర్లు చోటుచేసుకున్నాయి. రైతుల ట్రాక్టర్ ర్యాలీపై ఇప్పటివరకు 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. 200 మందిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Latest news

Related news