29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

జైలు నుంచి 27న విడుదల కానున్న శశికళ

త‌మిళ‌నాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయ‌ల‌లిత నెచ్చెలి.. పార్టీ కార్యకర్తలతో చిన్నమ్మగా పిలిపించుకున్న శ‌శిక‌ళ ఈ నెల 27వ తేదీన జైలు నుంచి విడుద‌ల కానుంది. బెంగ‌ళూరు జైలు అధికారులు ఈ మేరకు సమాచారం అందించినట్టు ఆమె త‌ర‌పు న్యాయ‌వాది రాజా సేథురా పాండ్యన్ వెల్లడించారు. 2016లో జ‌య‌ల‌లిత చనిపోయిన త‌ర్వాత అన్నాడీఎంకే అధినేత్రిగా బాధ్యత‌లు స్వీక‌రించిన శ‌శిక‌ళ‌.. నాలుగేండ్ల క్రితం అక్రమాస్తుల కేసులో బెంగ‌ళూరులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు.

నాలుగేండ్ల జైలుశిక్ష పూర్తి కాగా.. ఆమె జైలు నుంచి విడుదల కానుంది. ఇందుకు గానూ.. కోర్టు విధించిన 10 కోట్ల రూపాయల జ‌రిమానా చెల్లించాల్సి ఉంది. త్వర‌లో త‌మిళ‌నాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో శ‌శిక‌ళ జైలు నుంచి విడుద‌ల కావడంతో తమిళ రాజకీయాలు ఆమె చుట్టే తిరుగుతున్నాయి. త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రులు జ‌య‌ల‌లిత, ఎంకే క‌రుణానిధిలు మ‌ర‌ణించ‌డంతో రాష్ట్రంలో రాజ‌కీయ శూన్యత కొనసాగుతోంది. శశికళ ఆ లోటు తీరుస్తారని భావిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news