26 C
Hyderabad
Wednesday, January 27, 2021

ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి : సీఎం కేసీఆర్

కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ పనులకు అనుమతులు ఇవ్వాలని, కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులలో ఏదా ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం కేసీఆర్ కోరారు. కొవిడ్‌ ప్రభావంతో తగ్గిపోయినందున రాష్ట్ర రాబడిని తిరిగి పూర్వస్థితికి తెచ్చేందుకు ఆర్థిక లోటు భర్తీకి ప్రత్యేక నిధులు ఇవ్వాలని సీఎం కోరారు. 15వ ఆర్థిక సంఘం, స్వచ్ఛభారత్‌ మిషన్‌, అమృత్‌ పథకాలతోపాటు వివిధ శాఖల నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.

దిల్లీ పర్యటనలో రెండో రోజైన శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానిని కలిశారు. లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌లోని ప్రధానమంత్రి అధికారిక నివాసానికి రాత్రి ఏడు గంటలకు చేరుకున్న ఆయన సుమారు 45 నిమిషాలపాటు ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలను  సీఎం కేసీఆర్‌.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినట్టే.. కాళేశ్వరం గానీ, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు గానీ జాతీయ హోదా ఇవ్వాలని కోరారు.

- Advertisement -

Latest news

Related news

త్రివర్ణ హైదరాబాద్

72వ గణతంత్ర దినోత్సం వేళ హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్రక భవనాలు త్రివర్ణ లైటింగ్ తో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. వీటి వెలుగులను ఒకే ఫ్రెమ్ లో బంధించేందుకు డ్రోన్ కెమెరాలతో...

సీఎం గొప్ప లౌకికవాది.. మంత్రులు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవం ఇస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...

ర్యాలీపై ఆగ్రహం.. రైతుల అరెస్ట్.. ట్విట్టర్ ఖాతాలపై కన్ను

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ గా స్పందించింది....

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...