19.5 C
Hyderabad
Saturday, January 16, 2021

కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులివ్వండి : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో కొత్తగా మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతి ప్రక్రియను వేగవంతం చేయాలన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కోరారు. ఇప్పటికే.. ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏఏఐ, గగనతల స్థితిగతులను పరిశీలించి సానుకూల నివేదిక ఇచ్చింది. పౌరవిమానయానశాఖ తొందరగా విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందుకు కావలసిన అన్ని లాంఛనాలను పూర్తిచేస్తుంది. సొంత నిధులతో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉంది.

మూడురోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి శనివారం పలువురు కేంద్రమంత్రులను కలిశారు. కేంద్ర మంత్రితో సమావేశం సందర్భంగా తెలంగాణలో ప్రతిపాదిత విమానాశ్రయాలపై చర్చించారు. వరంగల్‌ జిల్లాలోని మామునూర్‌, పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని విమానాశ్రయాలను పునరుద్ధరించాలని, కొత్తగా నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, భద్రాద్రి కొత్తగూడెంలో ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకుగల అవకాశాలపై సాధ్యాసాధ్యాల నివేదికను ఇవ్వాలని కోరుతూ 2018లో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి ప్రతిపాదనలు పంపామని సీఎం తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు దాదాపు రెండున్నరేండ్ల క్రితమే 2018 మే 22న రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. ఇందులో మూడింటిని (మామునూర్‌, బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌) పునరుద్ధరించాలని, కొత్తగా నిజామాబాద్‌ (జక్రాన్‌పల్లి), మహబూబ్‌నగర్‌ (దేవరకద్ర), భద్రాద్రి కొత్తగూడెం (గ్రీన్‌ఫీల్డ్‌ యిర్‌పోర్ట్‌)లో ఏర్పాటుచేయాలని కోరింది. ఈ ఆరు విమానాశ్రయాలకు కావాల్సిన స్థలం అందుబాటులో ఉన్నదని, రన్‌వే (1400-1500మీటర్ల), క్యాబిన్‌, టెక్నికల్‌ బిల్డింగ్స్‌ కోసం భూమి సిద్ధంగా ఉన్నదని ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్‌ అవసరాల కోసం అవసరమైతే మరికొంత భూమిని సైతం సిద్ధం చేయగలమని స్పష్టంచేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో భేటీ కావడం సంతోషంగా ఉన్నది. తెలంగాణలో పౌరవిమానయాన శాఖ కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చ సాగింది. భవిష్యత్‌లో దేశంలో పౌరవిమానయాన విస్తరణ వంటి విషయాలపై చర్చించాం’అని తెలుపుతూ పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి.. సీఎం కేసీఆర్‌తో భేటీకి  సంబంధించిన నాలుగు ఫొటోలను ట్వీట్‌ చేశారు.

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...