మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతున్నది. కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మధ్య మాటల వార్ జరుగుతున్నది. కర్ణాటక సరిహద్దుల్లో మరాఠి మాట్లాడే ప్రాంతాలన్నిటినీ కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ విషయమై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలను కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి తీవ్రంగా ఖండించారు. మా రాష్ట్రంలో కొంతమంది ప్రజలు ముంబై-కర్ణాటక ప్రాంతానికి చెందినవారే అని.. అందువల్ల కర్ణాటక ప్రజలకు కూడా ముంబైపై హక్కు ఉంటుందన్నారు. ముంబైని కర్ణాటక రాష్ట్రంలో కలపాలన్నారు. అప్పటి వరకు ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని లక్ష్మణ్ సవాడి కోరారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల వార్.. ఎవరేమన్నారో తెలుసా?
