20.1 C
Hyderabad
Thursday, February 25, 2021

ఉత్తరాఖండ్ ఒక్కరోజు సీఎంగా.. కాలేజీ విద్యార్థిని

‘సృష్టి గోస్వామి అనే నేను.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా’ అంటూ కాలేజీ విద్యార్థిని ఒక్కరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. 24 ఏళ్ల సృష్టి గోస్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మూడు గంటల పాటు వివిధ ప్రభుత్వ పథకాలను సమీక్షించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించిన బాల విధాన సభలో.. రాష్ట్రంలోని వివిధ శాఖల పూర్తి వివరాలను ఆమె తెలుసుకుంది.

జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆమె ఈ అవకాశం దక్కించుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర బాల రక్షణ కమిషన్ నేతృత్వంలో సృష్టి గోస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. బాలికల సాధికారత సాధనలో భాగంగా ఈ సభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్‌ కమిషన్ తెలిపింది. ఇందులో భాగంగా సృష్టి గోస్వామి అనే విద్యార్థిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశామని కమిషన్ పేర్కొంది. ఆమె అధ్యక్షతన బాల విధాన సభ జరిగింది. ప్రభుత్వంలోని పలు శాఖల పనితీరును తెలుసుకుని.. సమీక్షించనున్నట్టు ఆమె తెలిపింది. సృష్టి గోస్వామికి ముఖ్యమంత్రి హోదా దక్కడంపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కూతురుకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి సృష్టి తల్లిదండ్రులు ధన్యవాదాలు చెప్పారు.

- Advertisement -

Latest news

Related news