29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

వ్యాక్సిన్ వికటిస్తే పరిహారం.. ఫ్రీ చికిత్స

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అయితే వ్యాక్సిన్లపై ప్రజల్లో భిన్నమైన భయాలు, అపోహలు ఉండటంతో కొన్ని చోట్ల ప్రజలు వ్యాక్సిన్లు వేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నమెంట్ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారు అనారోగ్యం పాలైతే వారికి పరిహారం ఇయ్యడంతోపాటు ప్రత్యేక ఆస్పత్రుల్లో ఫ్రీ చికిత్స చేయిస్తామని ప్రకటించింది.

ముంబైలోని 60 ప్రభుత్వ ఆసుపత్రుల్లో గల సెంటర్లలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను అంగీకరించిన 11 రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి.

- Advertisement -

Latest news

Related news