21.2 C
Hyderabad
Monday, January 18, 2021

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇస్తే.. పార్టీలో ఉండను : వీహెచ్

టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి అప్పగిస్తే పార్టీ వీడి వెళ్లిపోతానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతూ.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పార్టీలోనే ఉంటూ సేవ చేసిన తనకు కాకుండా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఎలా ఇస్తారని అధిష్టానాన్ని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇస్తే.. పార్టీలో ఉండను : వీహెచ్

రేవంత్ రెడ్డి కంటే తనకే ఎక్కువ క్రేజ్ ఉందని.. అయినా రేవంత్ రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తనతో పాటు చాలామంది సీనియర్ నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటున్న ప్రస్తుత తరుణంలో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం సరికాదన్నారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...