29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

రాష్ట్రపతి ఆవిష్కరించిన ఫొటో నేతాజీదేనా?

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌ ఆవిష్కరించిన బోస్‌ చిత్రపటం వివాదాస్పదమైంది. రాష్ట్రపతి భవన్‌లో కోవిద్‌ ఆవిష్కరిస్తున్న ఫొటోను రాష్ట్రపతి భవన్‌ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌ చేయగానే ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి.

రాష్ట్రపతి ఆవిష్కరించింది నిజమైన నేతాజీ చిత్రపటం కాదని.. 2019లో విడుదలైన ‘గుమ్నామీ’ చిత్రంలో బోసు పాత్రలో నటించిన ప్రసేన్‌జిత్‌ చటర్జీ అనే బెంగాలీ నటుడిదని నెటిజన్లు విమర్శలు చేస్తూ రీట్వీట్ చేశారు. తృణమూల్‌ ఎంపీ మహువామోయిత్రా కూడా ఈ విషయమై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. రాష్ట్రపతి ఆవిష్కరించింది నేతాజీ నిజమైన చిత్రపటాన్నే అని.. బోసు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫొటో ఆధారంగా ప్రముఖ చిత్రకారుడు పరేష్‌ మైటీ ఆ చిత్రాన్ని గీశారని రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే.. నేతాజీ చిత్రపటం విషయంలో సందిగ్ధం మాత్రం తొలగిపోలేదు. సోషల్ మీడియాలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.

- Advertisement -

Latest news

Related news