కేరళలోని మలప్పురంలోని రెండు స్కూళ్లకు చెందిన 192 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరిలో 91 మంది విద్యార్థులు ఒకే ట్యూషన్ సెంటర్లో చదువుతున్నట్లు ఆ జిల్లా డీఈఓ రమేశ్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరితోపాటు ఒక స్కూల్లో 39 మంది, మరో స్కూల్లో 33 మంది టీచర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నాడు. ఇప్పటి వరకు ఆ ట్యూషన్‌కు వెళ్లే వారితోపాటు రెండు స్కూళ్లలోని 2 వేల మంది స్టూడెంట్స్, టీచర్లకు కరోనా పరీక్షలు నిర్వహించామని డీఈఓ చెప్పారు.