రాజస్థాన్‌కు చెందిన అప్నా ఘర్ ఆశ్రమానికి చెందిన శారద అనే మహిళకు ఎటువంటి లక్షణాలు లేకున్నా.. అయిదు నెలల్లో 31 సార్లు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. భరత్పూర్ జిల్లాలోని ఆర్బీఎం హాస్పిటల్లో ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమెను జైపూర్‌లోని ఎస్ఎంఎస్ హాస్పిటల్‌కు తరలించాలని భావిస్తున్నారు.
గత ఏడాది ఆగస్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు శారదకు 31 సార్లు కోవిడ్ పరీక్షలు చేశామని, ప్రతిసారీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ భరద్వాజ్ చెప్పాడు.