ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్
వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని సమీక్ష
3 కోట్ల మంది ఫ్రంట్ వారియర్స్ కి మొదటగా వ్యాక్సిన్
ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవ్వనుంది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. మొదటి దశలో దేశంలోని 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్లను వేయనున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రెండుసార్లు విజయవంతంగా వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించిన విషయం తెలిసిందే.