22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

తెలంగాణలో తొలి కరోనా టీకా వారికే

కరోనా వ్యాక్సిన్ రావడంతో వైరస్ భయం నుంచి ఇప్పుడిప్పుడే జనాలు బయటపడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు సైతం వాక్సిన్ చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేష‌న్ పంపిణీ ప్రారంభం కానుంది. ఈ విషయమై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తొల కరోనా టీకా ఎవరికి వేయనున్నారో చెప్పారు.

కరోనా ప్రారంభం నుంచి గాంధీ ఆస్పత్రిలో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికుడికి తొలిటీకా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి బుధ‌వారం 20 వేల కొవాగ్జిన్ డోసులు వ‌చ్చాయి. తొలి రోజు 139 సెంటర్లలో ఒక్కో సెంటర్ కు 30 మందికి చొప్పున వ్యాక్సిన్ అందిస్తారు. గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్లకు, ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లకు మొదటగా వ్యాక్సిన్ అందిస్తారు.


తర్వాతి రోజు 50, అనంతరం 100 ఇలా అంచెలంచెలుగా వాక్సిన్ డోసులను పెంచ‌ుతారు. తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటి వరకు 3 లక్షల 30 వేల మంది ఆరోగ్య కార్యక‌ర్తలు రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారు. అనుమతి, సంతకం తీసుకున్నాకే వ్యాక్సిన్ డోసులు అంద‌జేయ‌నున్నట్లు వివరించారు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...