పెళ్లికి పోతే ఫస్టు.. పిల్లపిలగాని గురించి, కట్నకానుకల గురించి, ఆ తర్వాత వంటల గురించి మాట్లాడుకుంటరు. నాగబాబు బిడ్డ నిహారిక పెండ్లికి కోట్లు విలువ చేసే గిఫ్టులొచ్చినయని టాక్. అయితే.. మొన్న జరిగిన సునిత పెండ్లికి కూడా మస్తు గిఫ్టులొచ్చినయట. రామ్ వీరపనేనిని పెండ్లి చేసుకున్న సునిత పెండ్లికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు.. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా వచ్చిర్రు. పెండ్లి చేసుకున్నోళ్లు సెలబ్రిటీలే.. పెండ్లికి వచ్చినోళ్లు కూడా సెలబ్రిటీలే కాబట్టి.. వాళ్లు తెచ్చిన బహుమతులు కూడా వారి స్థాయిని బట్టి ఖరీదైనవే వచ్చాయట.
సునిత క్లోజ్ ఫ్రెండ్ యాంకర్ సుమ రూ.11 లక్షలు పెట్టి నెక్లెస్ చేయించింది. ఇంకా చాలామంది మంచి మంచి గిఫ్టులు సునిత, రామ్ దంపతులకు బహుకరించారు. దాదాపు గిఫ్టులన్నీ కలిపి రూ.కోటిన్నర దాటినయంట. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలో ఘనంగా జరిగిన సునిత పెండ్లికి గిఫ్టులు కూడా ఘనంగానే వచ్చినయ్.