29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఆగమైపోయిన కొవిడ్ వ్యాక్సిన్..

అస్సాంలోని కచార్ జిల్లాలో గల సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వ్యాక్సిన్ స్టోర్ యూనిట్ లోని వెయ్యి డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ పాడైపోయింది. వంద వయల్స్ లోని టీకాను సిల్చార్ మెడికల్ కాలేజీ ల్యాబ్ లో సబ్ జీరో టెంపరేచర్స్ లో నిల్వ చేశారు. నిజానికి 2.8 డిగ్రీల  సెల్సియస్  ఉష్ణోగ్రత మధ్య కొవిడ్ టీకాను స్టోర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆసుపత్రిలోని స్టోరేజీ యూనిట్ లో ఉష్ణోగ్రతలు జీరో స్థాయికి పడిపోయాయి. ఐఎల్ఆర్ ఫ్రిజ్ లో ఏదో సాంకేతిక సమస్య తలెత్తి ఉండవచ్చని అధికారులు చెప్తున్నారు.

సాధారణంగా ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఐఎల్ఆర్ మెషిన్ మెసేజ్ ఇస్తుందని, కానీ ఈ వ్యాక్సినేటర్ కి ఎలాంటి మెసేజ్ అందలేదన్నారు. రాత్రంతా ఈ టీకామందు ఫ్రిజ్ లోనే ఉండిపోవడంవల్ల పాడైపోయి ఉండవచ్చంటున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఎంతో ఖర్చుతో అత్యంత దూర ప్రాంతం నుంచి అందిన ప్రాణ రక్షణ టీకాను జాగ్రత్తగా నిల్వ చేయాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా వెయ్యి డోసుల వ్యాక్సిన్ పాడైపోవడం అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు.

- Advertisement -

Latest news

Related news